మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ప్రధానంగా ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచే హౌస్‌ఫుల్ షోలను నమోదు చేస్తూ, అద్భుతమైన వసూళ్లతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఇదే జోరు కొనసాగితే, అతి త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఈ చిత్రం అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు. ఈ స్థాయి వసూళ్లతో 2026 సంవత్సరానికి టాలీవుడ్‌కు అదిరిపోయే ఆరంభం లభించినట్టైంది.
