
జైపూర్: మర్డర్ కేసుల్లో జీవితకాల జైలుశిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ప్రేమలో పడ్డారు. ఆ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నది. ప్రస్తుతం జైపూర్ జైలులో ఆ జంట ఉంటోంది. పెళ్లి నేపథ్యంలో ఆ ఖైదీలు 15 రోజుల పెరోల్ కల్పించారు. లేడీ ఖైదీ ప్రియా సేథ్.. హనుమాన్ ప్రసాద్ పెళ్లికి జైలు అధికారులు ఓకే చెప్పేశారు. సంగనేర్ ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ప్రియా వయసు 34 ఏళ్లు.. హనుమాన్ ప్రసాద్ వయసు 29 ఏళ్లు. రాజస్థాన్ హైకోర్టు జనవరి ఏడో తేదీన ఇచ్చిన ఆదేశాల ప్రకారం పెరోల్ గ్రాంట్ చేశారు.
