సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళ పోలీసు వేసిన ప్రత్యేక సందేశాత్మక రంగవల్లి (ముగ్గు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సంక్రాంతి పండగ సందర్భంగా మహిళ పోలీసు వేసిన ప్రత్యేక సందేశాత్మక రంగవల్లి (ముగ్గు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ ఆర్. వనజ రంగురంగుల ముగ్గులతో పోలీసుల విధులు, ప్రజలకు పలు రకాల సూచనలతో అందంగా వేసిన ముగ్గు పలువురి ప్రశంశాలను అందుకుంది.
