పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను రోడ్డు మధ్యలో అతన్ని కస్టడీలోకి తీసుకుని మేం అరెస్ట్ చేసినమని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలా..? రాజకీయ నాయకుల మాట నమ్మలా మీరు చెప్పండన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మీడియా సమావేశంలో ఈ విషయమై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకవేళ బండి సాయి భగీరథ్‌ను సరెండర్ చేస్తే వాళ్ల పిల్లవాడిని ఇంట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి అప్పజెప్తరు. అప్పా జంక్షన్ మీ ఇల్లా.. నా ఇల్లా…? రోడ్డు మధ్య పోలీసులు నాకాబందీ చేసి వాహనాలను చెక్ చేస్తున్పప్పుడు అప్పా జంక్షన్లో బండి సాయి భగీరథ్ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేదుంటే అతడు ఎక్కడున్నడో అక్కడికి.. ఇక్కడ మా అబ్బాయి ఉన్నడు మీరొచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండని చెబితే అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో అతన్ని కస్టడీలోకి తీసుకుని మేం అరెస్ట్ చేసినమని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలా..? రాజకీయ నాయకుల మాట నమ్మలా మీరు చెప్పండన్నారు సీఎం రేవంత్ రెడ్డి
