‘ఈ పంట పండిచ్చుడెందుకు? పండీయకెందుకు? ఎండకు ఎండుతున్నం.. మలమల మాడుతున్నం.. కొన్నోడు లేడు.. కొల్సుకున్నోడు లేడు.. 20 రోజులుగా ఇదే గోస.. అరిగోస’..

కింటన్కు 8 బస్తాలు కట్ చేస్తాండ్లు. ఈ తీరుగ ఎప్పుడు చూడలే. నేను 18 ఎకరాల పంట పండిచ్చిన. ఈ పద్దెనిమిది ఎకరాల్లో నా సంతం ఐదు ఎకరాలు. మునాబు (కౌలు) పదమూడు ఎకరాలు. రైతుకు ఈయేడంత దరిద్రం ఎప్పుడులేదు. అందరూ రైతును ముంచుడే. 1200 బస్తాలు తెచ్చిన. ఇప్పటికీ 350 బస్తాలు ఎత్తిన (కాంటా అయినవి). ఈ 350 బస్తాలకే 6 కింటాండ్ల తరుగుపోయింది. ఇదివరకు బస్తకు అరకిలో.. కిలో తరుగుతీసేది. కానీ, ఎప్పుడు లేంది ఈసారి లెక్కబెట్టి తీస్తాండ్లు. బస్త (40కిలోల)కు మూడు కిలోల చొప్పున. తాలు అంటాండ్లు.. ఇంకేదో అంటాడ్లు.. ఇంకేదో అంటాండ్లు.. వడ్లు మంచిగ ఉంటెనే. ఇగ మంచిగలేకపోతే వాళ్లనోటికి మొక్కాలే. వాళ్ల కోతకు మొక్కాలే. ఇసొంటి కాలం ఎప్పుడు చూడలే.
