పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఉపసంహరించుకోవాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు

రామగిరి, జూన్ 08 : పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఉపసంహరించుకోవాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండ పట్టణంలోని ఒకటో డివిజన్ పానగల్లులో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తుమ్మల పద్మ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం హాస్యాస్పదమన్నారు.
