హైదరాబాద్‌లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున పూజ చేస్తూ దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ (62) మరణించారు.

హైదరాబాద్‌లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున పూజ చేస్తూ దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ (62) మరణించారు.వివరాల్లోకి వెళ్లే.. బేగంపేటలోని శ్యామ్‌లాల్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మీ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. రోజువారీ పూజల్లో భాగంగా తెల్లవారుజామున దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ చీరకు నిప్పంటుకుంది. దీంతో ఆమె భయంతో ఇంట్లో అటు ఇటు పరిగెత్తగా మంటలు మరింత వ్యాపించాయి. సోఫా, కర్టెన్లు, ఇతర ఫర్నీచర్‌కు సైతం మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. అలాగే ఇంట్లో పొగ నిండిపోవడంతో ఊపిరాడక కుప్పకూలింది.
