ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు తలమానికంగా ఉన్న పాలమూరు యూనివర్సిటీ మరోసారి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నది.

మహబూబ్నగర్ కలెక్టరేట్, మే 31 : ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు తలమానికంగా ఉన్న పాలమూరు యూనివర్సిటీ మరోసారి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నది. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జాతీయ స్థాయి ‘పీఎం ఉషా-మేరు’ సదస్సు నిర్వహించనున్నది. ఈ మేరకు కేంద్రం ఉ చ్ఛత్తర్ శిక్ష అభియాన్ (పీఎం ఉషా) పథకం కింద రూ.35లక్షల నిధులు కేటాయించింది. ఇది పాలమూరుకు మరో మైలురాయి కానున్నది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయా లు, పారిశ్రామిక రంగాల మధ్య సమన్వ యం, సహకారం, జ్ఞాన మార్పిడికి ఇది ఒక బృహత్తరమైన వేదికగా నిలవనున్నది.
