పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజల నోట్లో మట్టి కొట్టి రాక్షస ఆనందం పొందుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు.

నార్లాపూర్ రిజర్వాయర్ సందర్శనకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్తోపాటు బీఆర్ఎస్ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఉన్న నీళ్లు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వదిలినవని.. నాడు కేసీఆర్ సీఎం హోదాలో నీటి పం పింగ్ ప్రారంభించారని గుర్తు చేశారు.
