
(శ్రీరామ్ చక్రీన్యూస్,) 01-10-2026,హైదరాబాద్:బి.ఎన్.రెడ్డి నగర్: బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మహిళా థీమ్ పార్క్ నూతన కమిటీ ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లచ్చి రెడ్డి మాట్లాడుతూ మహిళా థీమ్ పార్క్ నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు నూతన కమిటీ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కాలనీవాసుల ఆరోగ్యం, ఆహ్లాదం, భద్రతను దృష్టిలో ఉంచుకుని పార్కును మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరంఉందన్నారు.కాలనీవాసులు తీరిక సమయంలో ప్రశాంతంగా గడపడంతో పాటు వాకింగ్, వ్యాయామం చేసుకునేందుకు ఈ పార్క్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. పార్క్ అభివృద్ధితో పాటు కాలనీలోని సమస్యల పరిష్కారానికి తమవంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.నూతన కమిటీ అధ్యక్షురాలిగా వర్ధిని, సెక్రటరీగా ఆంజనేయులు, ఉపాధ్యక్షుడిగా శివ నాగేశ్వర్, ట్రెజరర్గా నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీగా హైమావతి బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా జైపాల్ రెడ్డి, వాణి, నిర్మల, ప్రవీణ్, శ్రీధర్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, బీజేపీ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, కాలనీ ప్రతినిధులు సాంబశివరావు, కూర్మా రావు, సోమయాజులు, చంద్రశేఖర్ రెడ్డి, సాయికుమార్, పంపన వెంకటేశ్వర్లు, బసవయ్య, రంగారెడ్డి అర్బన్ జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీధర్ రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకరయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్, శరత్ కుమార్, లీలానాథ్, శ్రీనివాస్ రావు, సుధీర్ కుమార్, శబరినాథ్, కామేష్, విజయ్, మురళి తదితరులు పాల్గొన్నారు.
