యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి సొసైటీకి ఆదివారం 3,500 యూరియా బస్తాలు వచ్చాయి

రామారెడ్డి (సదాశివనగర్), జూన్ 8: యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి సొసైటీకి ఆదివారం 3,500 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని ఉదయం 6 గంటల నుంచి యాప్ ఓపెన్ చేయగా 20 నిమిషాల్లో 1106 యూరియా బస్తాలను రైతులు బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న రైతులు యూరియా తీసుకోవడానికి సొసైటీ వద్ద సోమవారం ఉదయం నుంచే బారులు తీరారు.
