తెలంగాణను సాధించింది, తీర్చిదిద్దింది ఉద్యమ సారథి కేసీఆరేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు

వైరా టౌన్, జూన్ 14: తెలంగాణను సాధించింది, తీర్చిదిద్దింది ఉద్యమ సారథి కేసీఆరేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఆయన కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని గుర్తుచేశారు. కొణిజర్ల మండలం అమ్మపాలెంలో ఆదివారం రాత్రి పర్యటించిన వారు.. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబుతో కలిసి గులాబీ జెండాను ఆవిష్కరించారు.
