సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి వదిలి పెడుతున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మంజీరా నదిలో సింగూరు బ్యాక్ వాటర్ మట్టం వేగంగా తగ్గుతున్నది. తద్వారా వేసవిలో జహీరాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే జహీరాబాద్ నియోజకవర్గంలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు

జహీరాబాద్, జనవరి 26: సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి వదిలి పెడుతున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మంజీరా నదిలో సింగూరు బ్యాక్ వాటర్ మట్టం వేగంగా తగ్గుతున్నది. తద్వారా వేసవిలో జహీరాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే జహీరాబాద్ నియోజకవర్గంలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు.
