బొమ్మనపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 685 లో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని బొమ్మనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు.

చిగురుమామిడి, అక్టోబర్ 27: రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు బొమ్మనపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 685 లో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని బొమ్మనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. అంతకుముందు కార్యాలయం వద్ద గ్రామస్తులందరూ కూర్చొని ఏకగ్రీవ తీర్మానం చేశారు. దశలవారీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
