ఢిల్లీ పేలుడు కేసులో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. పేలుడు కేసులో ప్రధాన అనుమానితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న డీఎల్10సీకే0458 అనే ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే

హర్యానాలోని ఖండవలి గ్రామంలో బుధవారం కనుగొన్నారు. అయితే, ఆ కారును అక్కడ పార్క్ చేసిన వ్యక్తిని ఫరీదాబాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతడిని ఫహీమ్గా గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది.
