హెచ్-1బీ వీసాలపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇప్పించేందుకే హెచ్1బీ ఉద్యోగాలని తెలిపారు.

విదేశీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయ వలసదారులను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై అనూహ్య స్పందన వ్యక్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఈ వీసా ప్రోగ్రామ్ని గట్టిగా సమర్థించారు. ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన స్వదేశీ ఉద్యోగులు లేని కారణంగా విదేశాల నుంచి నైపుణ్యం తెచ్చుకోవడం దేశానికి అవసరమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో హెచ్-1బీ వీసాలపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇప్పించేందుకే హెచ్1బీ ఉద్యోగాలని తెలిపారు.
