
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. సోమాజిగూడ డివిజన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీ రామారావు (కేటీఆర్) గారు నిర్వహించిన రోడ్‌షోకు భారీ జనసంద్రం తరలివచ్చింది,ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి, అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, కార్యకర్తలు కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికారు.

రోడ్‌షో సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ కేటీఆర్ ,
“కారుగుర్తు గుర్తుపై ఓటు వేసి సునీతా గోపీనాథ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలపరచాలని” కోరారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్ ,
“ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితికి నెట్టేశావు.
ఒక్క అవకాశం ఇచ్చినందుకే 700 మంది రైతులు, 165 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.
ఒక్క అవకాశం ఇచ్చినందుకే పాఠశాలలు మూతపడ్డాయి, గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.
ఒక్క అవకాశం ఇచ్చినందుకే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ నిలిచిపోయింది.

ఒక్క అవకాశం ఇచ్చినందుకే ప్రజల ఇళ్లు కూల్చే పరిస్థితి తెచ్చావు,” అని మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం తిరిగి బీఆర్ఎస్నే ప్రజలు నమ్మాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. రోడ్‌షో సందర్బంగా సోమాజిగూడ వీధులు బీఆర్ఎస్ జెండాలతో కాంతులీనాయి.
