కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది.

ఆదిలాబాద్ : పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎంపీ నగేశ్ ఇంటి ముందు బైఠాయించారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన మాజీ మంత్రి తోపాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్టు చేశారు.
