
హైదరాబాద్, (శ్రీరామ్ చక్రం న్యూస్) మార్చి 27: నగరంలో చికెన్ ప్రేమికులకు షాక్ ఇస్తూ, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడనున్నట్లు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లాభాలు తగ్గిపోవడంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.
మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వేసవిలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు పెరిగే అవకాశముంది. తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నవారు,
పాల్గొన్నవారు:
బడంగ్పేట్ జోనల్ ప్రెసిడెంట్ నారబోయిన ఆంజనేయులు ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ రాజు, సభ్యులు శివాజీ, కిషన్ రావు, నరేష్, శ్రీనివాసులు, వేణు, వీరన్న పాల్గొన్నారు.
