నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోమవారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతన్నలకు కన్నీరు మిగిల్చింది.
కుభీర్, మార్చ్ 31: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోమవారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. కుభీర్ తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలతోపాటు కూరగాయ పంటలు దెబ్బతినండంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి.. కష్టపడి పండించిన పంటలు కండ్ల ముందే నేల వాలడంతో మండల రైతాంగం లబోదిబో మంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో గోడ్సరా, గోడపూర్, సాంగ్వి గ్రామాలలో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
