తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆధారంగా తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపకల్పన చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

తరిగొప్పుల, మే 22 : తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆధారంగా తరిగొప్పుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపకల్పన చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తరిగొప్పుల మండలంలోని నర్సాపురంలో పైపులైన్ పనులు, గండీరామారం పంప్‌హౌస్ వద్ద కొనసాగుతున్న దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-1 పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. పనులు వేగవంతం చేసి రైతులకు త్వరగా సాగునీరు అందించాలని ఆదేశించారు
