
హైదరాబాద్:(శ్రీరామ్ చక్రీన్యూస్):25/6/2026 న్యూస్‌టుడే: చేవెళ్లలో BRS అవగాహన సదస్సు ఘన విజయం చేవెళ్ల నియోజకవర్గంలోని మల్కాపూర్ గేట్‌లోని పద్మావతి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన SIR ప్రక్రియ మరియు BRS డిజిటల్ సభ్యత్వ నమోదు డ్రైవ్ అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ BRS పార్టీ ఇన్చార్జ్ పి. కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, ప్రతి ఇంటికి పార్టీ భావజాలాన్ని చేరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొంటూ, ప్రజలతో మరింత అనుసంధానమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

