
హైదరాబాద్ :శ్రీరామ్ చక్రీ న్యూస్ పేపర్ .బడంగ్పేట, అక్టోబర్ 4: ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం: కార్తీక్ రెడ్డి, సామ మహేందర్ రెడ్డి,చేవెళ్ల: స్వర్గీయ మాజీ హోంమంత్రి, మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రజానాయకుడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో ఉన్న ఆయన సమాధి వద్ద నాయకులు, అభిమానులు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన తనయుడు, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి తదితరులు ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి సంక్షేమం కోసం నిరంతరం పరితపించిన గొప్ప ప్రజానాయకుడు ఇంద్రారెడ్డి అని కొనియాడారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, పోరాటాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.“ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఇంద్రారెడ్డి సేవలను ఎప్పటికీ మరువలేం. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. వాటి సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.
