సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు అనేక ఆఫర్లు చేస్తున్నారు. ఆఫర్లు, ఒప్పందాలు, ఒట్లు, బాండ్లు తదితర అంశాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి.

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం మొదలైందని చెప్పొచ్చు. ఎన్నికల్లో నిలబడటం, ఓటర్లను ఓటు అభ్యర్థించడం, డబ్బులు పంచడం లాంటి లాంగ్ ప్రాసెస్‌కు స్వస్తి చెప్పి ఏకంగా ‘ఏకగ్రీవం’ అయితే ఎలాంటి లొల్లి ఉండదనే అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి.
