సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. చింతల్ ఠాణా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది

వేములవాడ : ప్రజా సేవ చేయాలనే తపనతో, ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. చింతల్ ఠాణా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం, చింతల్ ఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెర్ల మురళి గుండెపోటుతో కన్నుమూశారు.
