అధికారుల తీరుమారదు.. చెత్త సమస్యకు పరిష్కారం కాదు. చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.

న్యూశాయంపేట, ఏప్రిల్ 2 : అధికారుల తీరుమారదు.. చెత్త సమస్యకు పరిష్కారం కాదు. చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. చెరువులు చెత్త డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. వరంగల్ గ్రేటర్ పరిధి డివిజన్లలో ఎక్కడ చూసినా చెత్తరోడ్లపై పేరుకుపోతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. అధికారులు ప్రకటనలకు పరిమితం అయ్యారు. పారిశుధ్యం పడకేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. పారిశుధ్యం లోపభూయిష్టంగా మారిందని ప్రజలు చెప్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడచూసినా చెత్త పేరుక పోవడంతో దోమలకు, ఈగలకు, పందులకు, వీధి కుక్కలకు నిలయాలుగా మారాయి.
