ధరల భారం పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. రోజు, రోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గృహావసరాల సిలిండర్ ధర మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.100 పెరగడంతో ప్రజలు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.

ఆదిలాబాద్, జూన్ 7 ః ధరల భారం పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. రోజు, రోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గృహావసరాల సిలిండర్ ధర మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.100 పెరగడంతో ప్రజలు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పది రోజుల్లో నాలుగుసార్లు పెరగగా.. వీటి పెరుగుదల ప్రజలు, చిరు వ్యాపారులు, రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఎండకాలం కావడంతో కూరగాయల ధరలు కూడా ఆకాశనంటాయి
