ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ మహిళలను వాడుకుంటున్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు. ఇవాళ లోక్‌సభలో ఆమె బిల్లులపై మాట్లాడారు. డీలిమిటేషన్‌పై ఎందుకు సీఎంలను సంప్రదించలేదని ఆమె అడిగారు.

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును డీఎంకే వ్యతిరేకించింది. ఇవాళ ఆ పార్టీ ఎంపీ కనిమొళి మాట్లాడారు. ఒకవేళ డీలిమిటేషన్ బిల్లు సరైన దశలోనే ఉండి ఉంటే, అప్పుడు ఆ బిల్లును ఎందుకు తమిళనాడు అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. డీలిమిటేషన్ అంశంపై ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రితోనూ కేంద్రం సంప్రదించలేదని ఆమె ఆరోపించారు. 2021లో జనాభా లెక్కలను ప్రభుత్వం వాయిదా వేసిందని, ఇప్పుడు వాటి స్థానంలో పాత జనాభా లెక్కలను తీసుకుంటున్నారని, అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.
