థాయ్‌పో జిల్లాలో బుధవారం ఎనిమిది 35 అంతస్తుల నివాస భవనాలలో భారీ ఎత్తున మంటలు చెలరేగి 36 మంది మరణించగా, 279 మంది గల్లంతైనట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది.


హాంకాంగ్ ; హాంకాంగ్‌లోని థాయ్‌పో జిల్లాలో బుధవారం ఎనిమిది 35 అంతస్తుల నివాస భవనాలలో భారీ ఎత్తున మంటలు చెలరేగి 36 మంది మరణించగా, 279 మంది గల్లంతైనట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. మంటలు వ్యాపించిన ఫ్లాట్లలో చాలా మంది ఇప్పటికీ చిక్కుకుని ఉన్నట్లు పత్రిక పేర్కొంది. ఎనిమిది భవనాలకు మంటలు వ్యాపించగా ఇప్పటివరకు కేవలం ఒక భవనంలోని మంటలనే ఆర్పినట్లు తెలిపింది. మరమ్మతుల కోసం భవనంపైన వెదురు కర్రలు అమర్చారని, వీటి కారణంగా మంటలు త్వరితంగా వ్యాపించాయని పేర్కొంది.
