దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారిపోతున్నది. కొన్నేండ్లుగా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది.

దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారిపోతున్నది. కొన్నేండ్లుగా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. విద్యపై ఉన్నతాధికారులు శ్రద్ధ తగ్గించి, పదవులు, పదోన్నతులు, బాధ్యతలపై దృష్టిసారిస్తుండటంతో పరిపాలన గాడితప్పుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. గడిచిన ఐదేండ్ల నుంచి ర్యాంకింగ్ గణనీయంగా పడిపోతుండటం యూనివర్సిటీపై మాయని మచ్చగా మారుతున్నది. ఈనేపథ్యంలోనే ఫైనాన్సియల్ ఎకనామిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న మయూక్ మృతి చెందడం కలకలం సృష్టించింది
