ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో బ్రాండెడ్ సైకిల్‌ను అందజేయాలని నిర్ణయించామని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు

భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వరుసగా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులతో నగరంలోని చైతన్యపురి కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించారు. స్వచ్ఛ పాఠశాల పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోన్ని అన్నిగ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లోన్నింటిని శుభ్రం చేయాలని నిర్ణయించారు.
