నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ప్రమావదశాత్తూ గోదావరి నదిలో గల్లంతయ్యారు.

నిర్మల్ జిల్లా: బాసరలో ఇవాళ (మంగళవారం) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ప్రమావదశాత్తూ గోదావరి నదిలో గల్లంతయ్యారు. హైదరాబాద్‌లోని కాచిగూడ చప్పల్ బజార్‌కు చెందిన ఓ కుటుంబం.. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్లారు. అయితే, దర్శనానికి ముందు పుణ్యస్నానాలు ఆచరించేందుకు కుటుంబ సభ్యులు గోదావరి నదిలోకి దిగారు
