కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

నిజాంసాగర్, మే 29: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తున్నదని, ప్రభుత్వానికి అన్నదాతల శాపం తప్పక తగులుతుందన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై అవగాహన సదస్సు నిర్వహించారు.
