బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు.

బోనకల్లు, మే 21 : బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. రావినూతల గ్రామంలోని మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ స్వగృహంలో గురువారం మండల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ అధినేత కేసీఆర్ డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు.
