రైతులు తమ మొక్కజొన్న చేలలోని వ్యర్థాలకు నిప్పంటించడంతో ప్రమాదవశాత్తు గాలికి మంటలు వచ్చి ధాన్యం బస్తాలకు అంటుకొని దగ్ధమయ్యాయి

గమనించిన రైతులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. సకాలంలో ఫైరింజన్ రాకపోవడంతో సుమారు వంద బస్తాల మేర ధాన్యం కాలిపోయింది. రూ.లక్ష మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నామని తెలిపారు.
