రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకాల వేతనాల సమస్యల గురించి బీఆర్ఎస్ పక్షాన ఖమ్మంలో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీఎం రేవంత్రెడ్డి ఈ చర్చకు రావాలని

ఖమ్మం సిటీ, జూన్ 29: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకాల వేతనాల సమస్యల గురించి బీఆర్ఎస్ పక్షాన ఖమ్మంలో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీఎం రేవంత్రెడ్డి ఈ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న సీఎం.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోయినా, గురుకులాలు అస్తవ్యస్తంగా మారినా స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
