వానకాలం సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్నారు. పొలాలు దుకులు దున్నేందుకు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. రోహిణి కార్తెలో పడే వర్షాలతో దుక్కులు సిద్ధం చేసి, ఒకటి రెండు భారీ వర్షాలు పడగానే విత్తనాలు వేయాల్సిన సమయం.

ప్రస్తుతం జిల్లాలోని రైతులు ఎదురొంటున్న ప్రధాన సమస్య. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండడంతో వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతింటున్నది. తరుగు, తేమ, రంగు మార్పు పేరుతో కోతలు విధిస్తున్నారు. చివరకు రైతుకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతున్నది. పంట అమ్మినా రైతు అప్పుల పాలవుతున్నాడు. వానకాలం ప్రారంభానికి ముందు రైతులకు రైతు భరోసా నిధులు అందితే కొంత ఉపశమనం లభించేంది. అది ఇప్పటికీ అతీగతిలేదు.
