వానలు మొదలైతే జనం పరవశించాలి. ఎండల తీవ్రత తగ్గుతుందని ఆనందపడాలి. కానీ హైదరాబాద్ మహానగరంలో చినుకుపడితే జనం వెన్నులో వణుకు పుడుతోంది. చెరువుల్లా మారే రహదారులు….

వానలు మొదలైతే జనం పరవశించాలి. ఎండల తీవ్రత తగ్గుతుందని ఆనందపడాలి. కానీ హైదరాబాద్ మహానగరంలో చినుకుపడితే జనం వెన్నులో వణుకు పుడుతోంది. చెరువుల్లా మారే రహదారులు, ఉప్పొంగే డ్రైనేజీలు, తెరిచి ఉండే మ్యాన్‌హోల్/క్యాచ్పిట్లు, తెగిపడే చెట్ల కొమ్మలు, విద్యుత్ వైర్లు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి. ఈ తిప్పలు తప్పించేందుకు ఏటా వానాకాలానికి ముందే సన్నద్ధత కోసం చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏటా సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు లెక్కల్లో చూపుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటోంది.
