భారతదేశం నుండి దిగుమతి చేసుకునే మామిడి పండ్లపై ఎలాంటి నిషేధం లేదని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారతదేశం నుండి దిగుమతి చేసుకునే మామిడి పండ్లపై(India Mangoes) ఎలాంటి నిషేధం లేదని నేపాల్(Nepal) ప్రభుత్వం స్పష్టం చేసింది. అధిక స్థాయిలో రసాయన పురుగు మందులు ఉన్నాయనే ఆరోపణలపై భారత మామిడిని నేపాల్ నిషేధం విధించామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నేపాల్ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అవి పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. నిర్ణీత ఫైటోశానిటరీ (Phytosanitary) మోతాదుకు లోబడి భారత మామిడి దిగుమతులకు అనుమతిస్తామని నేపాల్ ప్రభుత్వం పేర్కొంది.
