రుణాల చెల్లింపుల కోసం మహిళా సంఘాలు కట్టిన కిస్తీల సొమ్ము పక్కదారి పట్టింది. నెలనెలా చెల్లించిన డబ్బులు మహిళల ఖాతాల్లో జమకాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది

నిజాంసాగర్, జూన్ 14 : రుణాల చెల్లింపుల కోసం మహిళా సంఘాలు కట్టిన కిస్తీల సొమ్ము పక్కదారి పట్టింది. నెలనెలా చెల్లించిన డబ్బులు మహిళల ఖాతాల్లో జమకాకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. మూడేండ్లుగా సుమారు రూ. 27లక్షలు ఖాతాల్లో జమకాకపోవడంతో ఆందోళన చెందిన సంఘాల సభ్యులు.. అధికారులతోపాటు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ఇప్పటివరకూ వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. తాము చెల్లించిన డబ్బులు కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని మహ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు కోరుతున్నారు.
