ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాలు రసాభాసగా మారాయి. కాంగ్రెస్ హామీల అమలు, అధికారుల నిర్లక్ష్యంపై రైతులు, ప్రజల నిరసనలు, నిలదీతలతో ఉద్రిక్తతకు దారి తీశాయి

కోటగిరి/బిచ్కుంద/రామారెడ్డి/బోధన్, ఏప్రిల్ 16: ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాలు రసాభాసగా మారాయి. కాంగ్రెస్ హామీల అమలు, అధికారుల నిర్లక్ష్యంపై రైతులు, ప్రజల నిరసనలు, నిలదీతలతో ఉద్రిక్తతకు దారి తీశాయి. కోటగిరిలో స్థాయి సభ ప్రారంభం కాగానే హామీల అమలుపై అన్నదాతలు ప్రశ్నించారు. రైతుభరోసా ఏదీ..? ఎప్పుడిస్తారు? అసలు ఇస్తారా.. ఇవ్వరా? అని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు.. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
