జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నది. ప్రతిఏటా జిల్లాలోని కొడంగల్, తాండూ రు నియోజకవర్గాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుపడుతున్నా నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

వికారాబాద్, మే 28 : జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నది. ప్రతిఏటా జిల్లాలోని కొడంగల్, తాండూ రు నియోజకవర్గాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుపడుతున్నా నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ పత్తి విత్తనాల ముఠా కర్ణాటక సరిహద్దు కేంద్రంగా నడుస్తున్నదని పోలీసుల విచారణలో తేలింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన సేడం, గుల్బర్గాలలో నివాసముంటూ నకిలీ పత్తి విత్తనాల దందాను నడిపిస్తూ అక్రమంగా జిల్లాకు వాటిని తరలిస్తున్నట్టు గుర్తించారు. జిల్లాలో గత ఐదారేండ్లుగా కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో పట్టుబడిన వారం తా ఆంధ్ర ప్రాంతం వారేనని సమాచారం.
