తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ గ్రామంలో భూబాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వటంలేదంటూ రైతులు వాపోతున్నారు.

రంగారెడ్డి, మే 28 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ గ్రామంలో భూబాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వటంలేదంటూ రైతులు వాపోతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్న తమ భూములను ప్రభుత్వం పండ్ల మార్కెట్ ఏర్పాటు పేరుతో బలవంతంగా తీసుకోవడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములను తీసుకోవద్దంటూ ఆందోళనకు దిగిన రైతులను పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుం డా తమ భూముల్లోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించటంలేదని, తమను దొంగల్లా చూస్తున్నారని పేర్కొంటున్నారు.
