కామారెడ్డి జిల్లాలో మక్క రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. 2025-26 యాసంగి సీజన్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు.

కామారెడ్డి జిల్లాలో మక్క రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. 2025-26 యాసంగి సీజన్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపుగా 40వేల ఎకరాల్లో మక్క పంట సాగైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం దిగుబడి 12లక్షల నుంచి 14లక్షల క్వింటాళ్లు వచ్చింది. నెల రోజులు అవుతోన్న మక్క సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవడం లేదు. మక్క కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రోడ్డుపైనే రైతులు పడిగాపులు కాస్తున్నారు.
