యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు

యాదాద్రి, మే 23: ఈరోజు(శనివారం) ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం.. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలకు రేవంత్ శంకస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి వేదపాఠశాలకు భూమిపూజ చేశారు. అనంతరం రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పై కప్పు నిర్మాణానికి, రూ.1.35 కోట్లతో నిర్మించనున్న రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి, రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు
