రైతులు తక్కువ కాలపరిమితి గల పంటలు వేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ దివాకర అన్నారు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలని సూచించారు

కూసుమంచి, జూన్ 8 : రైతులు తక్కువ కాలపరిమితి గల పంటలు వేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ దివాకర అన్నారు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. ఈశ్వరమాధారం గ్రామంలో సోమవారం జరిగిన ప్రజా పాలన – ప్రగతి నివేదిక గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
