
(శ్రీరామ్ చక్రీ న్యూస్ )మీర్పేట్, న్యూస్ టుడే: జీహెచ్ఎంసీ 60వ డివిజన్ పరిధిలోని మీర్పేట్ దాసరి నారాయణరావు కాలనీ, కమల నెహ్రూ నగర్ కాలనీలలో మహనీయుల విగ్రహాల సమీపంలో గురువారం రాత్రి మొహర్రం పీర్ల పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దాతగా మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, పీర్ల ఏర్పాటుకు ఆరు సంవత్సరాల క్రితం స్థలం కేటాయించి షెడ్ నిర్మించి అందించిన మాజీ మంత్రి, ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్న వంగూరు మల్లయ్య యాదవ్, ఐతరాజు యాదయ్య, బొమ్మకంటి దానం ముదిరాజ్, ఐతరాజు వెంకటేష్లను ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ అభినందించారు.మొహర్రం పీర్ల పండుగను మతాలకు అతీతంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, త్యాగం, సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాదారి సురేఖ రమేష్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అబ్బనమోని గోపి యాదవ్, ఉద్యమకారుడు ఉట్కూరి నవీన్, మాజీ టెంపుల్ డైరెక్టర్ సుర్విలత శేఖర్ గౌడ్, దాసరి ఎల్లయ్య, భీమరాజు బిక్షపతి, పుప్పాల రామకృష్ణ, వంగూరి మహేష్ యాదవ్, వంగూరి శ్రీశైలం యాదవ్, బక్కతట్ల కృష్ణ యాదవ్, భూతరాజు చందు, శివకృష్ణ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, సదువుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
