వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వలస కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఊరట కలిగించేలా వారికి 5 కేజీల ఎఫ్టీఎల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు

వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వలస కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఊరట కలిగించేలా వారికి 5 కేజీల ఎఫ్టీఎల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.ఓఎంసీల సాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని నీరజ్ సూచించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా ఇరాన్ కొన్ని దేశాలను మాత్రమే అనుమతిస్తుండటంతో మిగతా దేశాలు అవస్థలు పడుతున్నాయి. భారత చమురు నౌకలను ఇరాన్ వదిలిపెడుతున్నప్పటికీ మునుపటి స్థాయిలో దేశంలో గ్యాస్ సరఫరా జరగడంలేదు.
