
(శ్రీరామ్ చక్రీ టీవీ )17/9/2026,హైదరాబాద్: బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల రాఘవేందర్ ముదిరాజ్ను ములుగు జిల్లా ఇన్చార్జిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో బీజేవైఎంను గ్రామస్థాయి వరకు బలోపేతం చేస్తామని రాఘవేందర్ తెలిపారు. యువత సమస్యలపై పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
