
మీరుపేట్, ఏప్రిల్ 27:( శ్రీరామ్ చక్రి న్యూస్) బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు రజితోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో, మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ మీర్పేట్ 60వ డివిజన్లో పార్టీ జెండా వేడుక ఘనంగా జరిగింది.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి సూచనలతో పాష్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ జెండాను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వాన్ని ప్రశంసించారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గంలో పేదల సమస్యల పరిష్కారానికి సబితా ఇంద్రా రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం మాజీ డైరెక్టర్ మేకల యాదగిరి, జిల్లెలగూడ శ్రీ మత్స్య వెంకటేశ్వర స్వామి దేవాలయం మాజీ డైరెక్టర్ సుర్వి లతా శేఖర్ గౌడ్, కాంటెస్టెడ్ ఎంపీటీసీ కర్రె వెంకటేష్ కురుమ, కాంటెస్టెడ్ కార్పొరేటర్ ప్యాట నరసింహ్మ, సీనియర్ నాయకుడు పుప్పాల రామకృష్ణ, కార్మిక విభాగం నాయకులు కేతరాజు శంకర్, స్థానిక నాయకులు సహదేవ్, రూప్ కరణ్, బద్యానాయక్, మహమ్మద్ అలీ, బషీరాభి, శాయిరా తదితరులు పాల్గొన్నారు.
